Shopping cart

Magazines cover a wide array subjects, including but not limited to fashion, lifestyle, health, politics, business, Entertainment, sports, science,

banner 1

Shopping cart

Magazines cover a wide array subjects, including but not limited to fashion, lifestyle, health, politics, business, Entertainment, sports, science,

banner 1
  • Home
  • telugutone
  • లైసెన్సెడ్ సర్వేయర్ తేజెశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు…
telugutone

లైసెన్సెడ్ సర్వేయర్ తేజెశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు…

36

👉కెనరా బ్యాంక్ అనుబంధం గా ఉన్న CanFin Homes Ltd నందు మేనేజర్ గా ఉన్న తిరుమలరావు.

👉తిరుమలరావు మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో ఐశ్వర్యపై మోజు పెంచుకున్న తిరుమలరావు.

👉ఐశ్వర్యతో వివాహం చేసుకుని తన ఆస్తికి వంశాన్ని నిలబెట్టుకోవాలని ఆలోచన చేసిన తిరుమలరావు.

👉మొదటగా తిరుమలరావు తన కార్యాలయంలో స్వీపర్ గా పనిచేస్తున్న సుజాత(ఐశ్వర్య తల్లి)తో అక్రమసంబంధం ఏర్పర్చుకున్నాడు.

👉ఆ తర్వాత Buy 1 Get 1 మాదిరి తల్లికి తోడు పిల్లను కూడ కావాలనుకోవడంతో సుజాతతో ఐశ్వర్య గురించి మాట్లాడుకున్నాడు.

👉ఐశ్వర్యను గద్వాల పట్టణం గంటవీదికి చెందిన తేజెశ్వర్ తో ఎంగేజ్ మెంట్ అయ్యాక అసలు కథ మొదలైంది.

👉కర్నూల్ అమ్మాయి ఐశ్వర్య తో డిసెంబర్ 18-2024 న తేజెశ్వర్ తో ఎంగేజ్ మెంట్ అయిన నాటి నుండి తేజెశ్వర్ ను హత్య చేసేందుకు 5 సార్లు రిక్కీ నిర్వహించినట్టు సమాచారం.

👉ఎంగేజ్ మెంట్ అయ్యాక పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో కొద్దిరోజులు తిరుమలరావు తో వెళ్ళిపోయిన ఐశ్వర్య.

👉5 సార్లు రిక్కీ ఫెయిల్ అవ్వడంతో తేజెశ్వర్ బైక్ పై ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో సులువుగా తెలుసుకునేందుకు ఐశ్వర్య తేజెశ్వర్ ద్విచక్రవాహనానికి GPS అమర్చింది.

👉ఐశ్వర్య ఎంగేజ్మెంట్ అయిన నాటి నుండి మూడు నెలల్లో తన ప్రేమికుడు తిరుమలరావుతో 2200 కాల్స్ మాట్లాడితే, ఎంగేజ్మెంట్ అయిన తేజెశ్వర్ తో 120 కాల్స్ మాట్లాడినట్టు తేజెశ్వర్ కుటుంబ సభ్యులు తెలిపారు.

👉కర్నూల్ లో గోపి అనే వ్యక్తి నుండి నెలకు 25000 రూపాయలు అద్దె మాట్లాడి షిఫ్ట్ డిజైర్ కారు 25 రోజుల కిందట అద్దెకు తిరుమలరావు తీసుకున్నాడు.

👉కారులో తేజెశ్వర్ ను తీసుకెళ్లేందుకు సులువుగా కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ పెట్టుకున్నారు.

👉 బంధువుల పొలం హద్దులు చూయించాలని ఐశ్వర్య చెప్పడంతో ఈనెల 17 న గద్వాల పట్టణం ఫాతిమ ITI దగ్గర తన ద్విచక్ర వాహనాన్ని ఆపి కారులో వెళ్ళిపోయిన తేజెశ్వర్.

👉 కారులో వెళ్లి ఇటిక్యాల మండలం మొగలిరావుల చెరువు వద్ద పొలం చూసి వస్తుండగా పని అయిపొయింది నేను వెళతాను అని కారులో ఉన్న వాళ్లకు చెప్పిన క్షణాల్లోనే తేజెశ్వర్ పై మూకుమ్మడి దాడి.

👉దాడి నుండి తప్పించుకునేందుకు తేజెశ్వర్ ప్రయత్నించగా వెనక నుండి గొంతుపై కత్తి పెట్టి గొంతుకోసేసినట్టు సమాచారం.

👉తేజెశ్వర్ ను తీసుకెళ్లిన రెండు గంటలలోపే హత్య చేసినట్టు సమాచారం.

👉చనిపోయాడని నిర్దారణకు వచ్చిన వెంటనే తిరుమలరావు, ఐశ్వర్యలకు సమాచారం తెలిపిన హంతకులు.

👉తేజెశ్వర్ కనపడట్లేదని గద్వాల పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన తేజెశ్వర్ కుటుంబసభ్యులు.

👉విచారణ నిమిత్తం తేజెశ్వర్ ఇంటికి వెళ్లి పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో కూడ సరైన సమాధానం చెప్పని ఐశ్వర్య.

👉పోలీసుల కదలికలపై గట్టి నిఘా ఉంచుకుని తనదైన రీతిలో ప్రవర్తించిన ఐశ్వర్య.

👉తేజెశ్వర్ ను హత్య చేసేందుకు తిరుమలరావు డ్రైవర్ నగేష్ సుపారీ మాట్లాడినట్టు కీలక సమాచారం.

👉హత్యలో కీలక సూత్రదారి తిరుమలరావు దొరకకపోవడంతో నిజానిజాలు నిర్దారణకు రావట్లేదు.

👉ప్రధాన నిందితుడు తిరుమలరావు లాస్ట్ లొకేషన్ హైదరాబాద్ వస్తుండటంతో రెండు బృందాలుగా పోలీసులు గాలిస్తునట్టు సమాచారం.

👉పోలీసుల అదుపులో ఐశ్వర్య, ఐశ్వర్య తల్లి సుజాత మరో ఇద్దరు ఉన్నట్టు సమాచారం.

Your email address will not be published. Required fields are marked *

Related Posts