హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, సాక్షి మీడియా ప్రతినిధి అయిన కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోమవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి, ఆయన్ను విచారణ కోసం తీసుకెళ్లారు.
అరెస్ట్‌కి కారణమైన కేసు నేపథ్యం
అమరావతికి చెందిన మహిళలు, అలాగే రాజధాని ఉద్యమంలో పాల్గొన్న రైతులపై కొమ్మినేని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన అరెస్టుకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు వారికి అపహాస్యం కలిగించాయి అంటూ తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు కావడంతో, పటమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై, ఆపై ఆయనను అరెస్ట్ చేశారు.
కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరు?
తెలుగు మీడియా రంగంలో కొమ్మినేనికు ప్రత్యేక స్థానం ఉంది.
- 1978లో ఈనాడులో తన జర్నలిస్టిక్ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన,
- ఆంధ్రజ్యోతి, ఎన్‌టీవీ, టీవీ5, సాక్షి టీవీ తదితర ప్రముఖ ఛానళ్లలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
- 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమితులైన ఆయన, 2024 జనవరిలో ఆ పదవికి రాజీనామా చేశారు.