జూనియర్ అంబానీకి 108 కిలోల బరువు తగ్గించిన న్యూట్రిషనిస్ట్!
ఆమె చెప్పే ఆహార సూత్రాలు డయాబెటిస్ ఉన్నవారికే కాక, సాధారణంగా అందరికీ ఉపయోగపడతాయి.
1. పండ్లు భయపడకుండా తినండి
అరటి, ద్రాక్ష, మామిడి, సపోటా — ఏది అయినా ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటుంది. మామిడి మీకు స్థానికం కాబట్టి అది ఆపిల్ కంటే మంచిది. ఫ్రక్టోజ్ గ్లూకోజ్ నియంత్రణలో సహాయపడుతుంది.
2. నేచురల్ ఆయిల్స్ వాడండి
వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె వాడండి. ప్యాకేజ్డ్ వెజిటెబుల్ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్స్ కన్నా ఇవే మెరుగైనవి.
3. నెయ్యిని రోజువారీ ఆహారంలో వాడండి
నెయ్యి కొలెస్టరాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు.
4. కొబ్బరిని విస్తృతంగా వాడండి
పులిహోర, చట్నీలు, అన్నంలో కొబ్బరి చేర్చండి. ఇది నడుము భాగంలోని కొవ్వును తగ్గిస్తుంది.
5. ఓట్స్, ధాన్యాలు వంటి ప్యాకేజ్డ్ బ్రేక్‌ఫాస్ట్ మానేయండి
ఇవి రుచీ పచీ లేని, ప్రయోజనం లేని ఆహారాలు. మొదటి ఆహారం ఆసక్తికరంగా ఉండాలి. బదులుగా పోహా, ఉప్మా, ఇడ్లీ, దోశ, పరోటా తినండి.
6. ఫైబర్ కోసం ఇంటి ఆహారమే తీసుకోండి
ఓరియో బిస్కెట్ వల్ల పీచు (ఫైబర్) రాదు. ఫైబర్ కోసం ఇంట్లో తినే సాధారణ ఆహారమే సరిపోతుంది.
7. పళ్ళు ఉన్నంత కాలం జ్యూస్ తాగకండి
మీకు పళ్ళు ఉన్నప్పుడు వాటినే తినండి. జ్యూస్ తినడం కన్నా మేము పళ్ళే మెరుగైనవి.
8. చెరుకురసం మీ శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది
చెరుకును రసం రూపంలో లేదా ముక్కలుగా తినొచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
9. PCOS, థైరాయిడ్ ఉన్నవారు శక్తివంతమైన వ్యాయామాలు చేయాలి
బరువు తగ్గేందుకు ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ అవసరం. ప్యాకేజ్డ్ ఫుడ్స్ పూర్తిగా మానేయండి.
10. తెల్ల అన్నమే సరిపోతుంది
బ్రౌన్ రైస్ అవసరం లేదు. తెల్ల అన్నం GI తగ్గేలా పప్పు, పెరుగు, పులుసుతో కలిపి తినండి. నెయ్యి చేరిస్తే GI ఇంకాస్త తగ్గుతుంది.
11. తినే పరిమితి మీ ఆకలిని బట్టి నిర్ణయించండి
మీ శరీరం చెప్పే ప్రకారం తినండి. ఆకలిగా ఉంటే తినండి, ఎక్కువ తిన్నా భయం వద్దు.
12. రైస్, చపాతీ రెండింటినీ తీసుకోవచ్చు
లేదా మీ ఇష్టానుసారం ఏదో ఒకటి మాత్రమే తీసుకోవచ్చు. రోజులో మూడు పూటలా కూడా అన్నం తినవచ్చు.
13. ఆహారం భయాన్ని కలిగించకూడదు
నెయ్యి లేదా అన్నం తినకూడదనే భయాలను పోగొట్టండి. మీరు తినే ఆహారం సంతృప్తినిచ్చేలా ఉండాలి.
14. కేలరీల కన్నా పోషకాల పైన దృష్టి పెట్టండి
ఎన్ని కేలరీలు తిన్నానో కాక, ఎంత న్యూట్రిషన్ పొందానో చూడండి.
15. ఫాస్ట్ ఫుడ్స్ పూర్తిగా మానేయండి
పిజ్జా, పాస్తా, బ్రెడ్, బిస్కెట్, కేకులు వంటివి పూర్తిగా మానేయడం మంచిది.
16. ఇంట్లో పెద్దవాళ్లు తినే ఆహారమే తినండి
“ఈ ఫుడ్ మా అమ్మమ్మ తినేదా?” అనే ప్రశ్న మీరే అడుకోండి. జవాబు అవును అయితే భయపడకుండా తినండి.
17. సీజనల్ ఆహారం తీసుకోండి
వర్షాకాలంలో పకోడీ, జిలేబీలు లాంటి సీజనల్ వంటకాలు తినవచ్చు. భయం వద్దు.
18. టీ త్రాగడంలో జాగ్రత్త
ఉదయం లేవగానే లేదా ఆకలిగా ఉన్నప్పుడు టీ తాగకండి. మిగతా సమయాల్లో రోజు 2–3సార్లు తాగొచ్చు.
19. గ్రీన్ టీ తాగకండి
గ్రీన్, యెల్లో, పర్పుల్, బ్లూ టీ లాంటివి అవసరం లేదు.
20. మీ సాంప్రదాయ ఆహారాన్ని గౌరవించండి
ఇది మీ ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరమైనది.
21. నిల్వ చేసుకున్న ప్యాకేజ్డ్ ఫుడ్స్ పూర్తిగా మానేయండి
అవి శరీరానికి అవసరం లేని వాటే.
22. వ్యాయామం చేయండి
రోజూ వాకింగ్ లేదా శరీరానికి తగిన వ్యాయామం చేయడం ఆరోగ్యానికి అవసరం.
మూలం: త్రీ స్టార్ వాకర్స్ క్లబ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విశాఖపట్నం – 7