జైపూర్, మే 23, 2025 – పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దేశమంతటా పాకిస్తాన్‌పై ఆగ్రహం చెలరేగింది. సోషల్ మీడియాలో నెటిజన్లు “మైసూరు పాక్‌లో ‘పాక్’ ఉంది, పేరే మార్చేయ్!” అంటూ మీమ్స్ జోరుగా పంచుకున్నారు. ఈ జోష్ జైపూర్‌లోని ప్రఖ్యాత మిఠాయిల దుకాణం “త్యోహర్ స్వీట్స్” యజమాని అంజలీ జైన్‌ను ఎంతో ప్రభావితం చేసింది.
ఆమె ఒక్కసారిగా షాపులోని “మైసూరు పాక్” పేరు మార్చి “మైసూరు శ్రీ”గా మలిచారు. అంతేకాదు, మోతీ పాక్ ఇప్పుడు “మోతీ శ్రీ”, ఆమ్ పాక్ “ఆమ్ శ్రీ”, గోండ్ పాక్ “గోండ్ శ్రీ”గా మారాయి. బంగారు వెండి పదార్థాలతో తయారయ్యే స్వర్ణ భాషం పాక్ ఇప్పుడు “స్వర్ణ శ్రీ”, చాందీ భాషం పాక్ “చాందీ శ్రీ”గా పునర్నామకరణం చేశారు.
అంజలీ జైన్ స్పష్టంగా చెప్పారు:
“దేశభక్తి అనేది సరిహద్దుల్లో మాత్రమే కాదు. అది ప్రతి భారతీయుడి గుండెలో, గొంతులో, ఇప్పుడు మిఠాయిల పేర్లలో కూడా ఉండాలి! ‘పాక్’ అంటే కన్నడలో తీపి అన్నా, ఇప్పుడు ‘శ్రీ’ అనేదే నిజమైన రుచి!”
సోషల్ మీడియాలో కలకలం
ఈ మార్పుపై నెటిజన్లు తమదైన హ్యూమర్‌తో స్పందిస్తున్నారు.
ఒకరు ట్వీట్ చేశారు –
“ఇక కరివేపాకు కూడా కరివేశ్రీ అవుతుందేమో!”
మరోకరు నవ్వుతూ రాశారు –
“మైసూరు శ్రీ తిన్నాక, దేశభక్తి కలిగిన రుచి బర్ఫీలా కరిగిపోతుంది!”
పేరు మార్చితే రుచి మారుతుందా?
అయితే, కొంతమంది వినియోగదారులు ఈ నామ మార్పుపై నవ్వుతున్నారు.
ఒక కస్టమర్ ముద్దుగా ప్రశ్నించారు:
“మైసూరు పాక్‌లో ‘పాక్’ తీసేసినా, నెయ్యి, శనగపిండి ఇంకా అదే కదా?”
‘శ్రీ’ శకానికి శ్రీకారం?
ప్రస్తుతం, జైపూర్‌లోని “త్యోహర్ స్వీట్స్” వద్ద ఈ ‘శ్రీ’ స్వీట్లను టేస్ట్ చేయడానికి కస్టమర్లు క్యూలో నిలుస్తున్నారు. ఈ ట్రెండ్ ఇతర షాపులకూ వ్యాపిస్తుందా? ఇకపై కరివేపాకు “కరివేశ్రీ”, నీళ్లపాకం “నీళ్లశ్రీ”గా మారుతాయా?
ఈ మార్పులు చూస్తుంటే, త్వరలో “పాక్” అనే పదం డిక్షనరీ నుంచే తుడిపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయేమో అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మీ అభిప్రాయం ఏమిటి? “శ్రీ” స్వీట్లకు మీరు ఓటేస్తారా? కామెంట్‌లో చెప్పండి!