Shopping cart

Magazines cover a wide array subjects, including but not limited to fashion, lifestyle, health, politics, business, Entertainment, sports, science,

banner 1

Shopping cart

Magazines cover a wide array subjects, including but not limited to fashion, lifestyle, health, politics, business, Entertainment, sports, science,

banner 1
  • Home
  • telugutone Latest news
  • విక్కీ కౌశల్: చారిత్రక పాత్రలకు నూతన ప్రాణం
telugutone Latest news

విక్కీ కౌశల్: చారిత్రక పాత్రలకు నూతన ప్రాణం

74

చారిత్రక ఘట్టాలు, సంఘటనలను పాఠాల్లో చెప్పినంత సులభం కాదు వెండితెరపై ఆవిష్కరించడం. అవి రక్తికట్టాలంటే, నటుడు ఆ కథా ప్రపంచంలో పూర్తిగా లీనమై ఉండాలి. ఆ పాత్రల ఆహార్యాన్ని ఒడిసిపట్టాలి. వాటి తాలూకా జీవాన్ని ఆవాహన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ చిత్రాలు అజరామరం అవుతాయి.

ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో అలాంటి స్ఫూర్తిదాయక నటనను ప్రదర్శిస్తున్నాడు విక్కీ కౌశల్. నిజ జీవిత పాత్రలను పోషిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన విక్కీ, ఒక్కో మెట్టు అధిరోహిస్తూ, కమర్షియల్‌ సినిమాలతో పాటు వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ తనలోని నటనకు పదును పెడుతున్నాడు. ‘సర్దార్‌ ఉద్దమ్‌’, ‘సామ్‌ బహదూర్‌’, తాజా థియేటర్‌లో అదరగొడుతున్న ‘ఛావా’ వంటి చిత్రాలు ఈ జాబితాలో నిలిచే అద్భుత కృషి.

‘ఉరి’ – మలుపుతిప్పిన సినిమా

‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ విక్కీ కౌశల్‌ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. అందులో సైనిక కమాండోగా విక్కీ చేసిన నటన మేటి. కానీ అతను ఇక్కడే ఆగలేదు. ‘సర్దార్‌ ఉద్దామ్‌’ (Sardar Udham) కోసం విక్కీ పడిన కష్టం తెరపై ప్రతిఫలించింది. 40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు తన శరీరాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. 14 కిలోల బరువు తగ్గి, తర్వాత అంతే బరువు పెరిగాడు. ఉద్దామ్‌ సింగ్‌ జీవిత ప్రయాణంలో ఆ మార్పును మనం తెరపై తిలకించొచ్చు. “ఆ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా నేను ఎంతో కష్టపడాల్సి వచ్చింది,” అని విక్కీ చెప్పిన మాటలే దీనికి నిదర్శనం.

‘సామ్ బహదూర్’ – ఓ అధ్యయనం

భారతదేశ మొదటి ఫీల్డ్‌ మార్షల్‌ శ్యామ్‌ మానెక్‌షా జీవిత కథను తెరపై ఆవిష్కరించిన ‘సామ్‌ బహదూర్‌’ (Sam Bahadur) లో విక్కీ తన నటనతో మంత్రముగ్ధులను చేశాడు. ఈ పాత్రను అర్థం చేసుకోవడానికి రెండు మూడేళ్లు పరిశోధన చేశాడు. మానెక్‌షా నడక, మాటతీరు, ఆయన బాడీ లాంగ్వేజ్ ను పటిష్ఠంగా అనుసరించాడు. గంటల తరబడి వీడియోలను చూస్తూ, ఆయన పుస్తకాలు చదువుతూ, కుటుంబ సభ్యులను కలిసి అనేక వివరాలను సేకరించాడు. ఈ క్రమంలో మానెక్‌షా లా నడవడం, మాట్లాడటం నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టిందని విక్కీ స్వయంగా చెబుతాడు.

‘ఛావా’ – శంభాజీగా విక్కీ మార్పు

‘ఛావా’ (Chhaava) సినిమాలో విక్కీ ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా తన మునుపటి ప్రదర్శనలన్నింటినీ మించేలా కనిపించాడు. రాజుగా రాజసాన్ని ప్రదర్శించడమే కాదు, భార్యను ప్రేమగా పిలిచే భర్తగా, శత్రువులపై రణతాండవం చేసే యోధుడిగా కూడా శంభాజీ పాత్రను జీవించాడు. ఈ పాత్ర కోసం 100 కిలోల బరువుపెంచుకున్నాడు.
కేవలం శారీరకంగా సిద్ధమవడమే కాదు, గుర్రపు స్వారీ, కత్తి సాము, పోరాట కళలు వంటి ప్రతిఒక్కటీ శిక్షణ తీసుకున్నాడు. కథాగమనం కొంతచోట్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా, విక్కీ నటన వాటన్నింటినీ కప్పిపుచ్చేసింది.

విక్కీ కౌశల్ – ఓ పాఠం

చారిత్రక పాత్రలు చేయాలనుకునే ప్రతి నటుడు విక్కీ కౌశల్‌ ను ఒక పాఠంగా భావించాలి.

  • ముందు ఆ పాత్రను మనం చేయగలమా లేదా అన్నది అంచనా వేయాలి.
  • పరిశోధన చేయాలి.
  • ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి.
  • చివరికి ఆ పాత్రగా మారిపోవాలి.

ఇదే అసలైన నటన. అప్పుడే సినిమా మెరుస్తుంది. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది. ‘ఛావా’ విక్కీ ప్రయాణానికి ఆఖరి అంకం కాదు. తనలో ఆ తపన ఉన్నంతవరకు, మరిన్ని అద్భుతమైన పాత్రలు ఆయన నుంచి రావడం ఖాయం.

హర హర మహాదేవ శంభో శంకర 🙏🚩
జై శివాజీ జై భవాని!

Your email address will not be published. Required fields are marked *

Related Posts