కేటీఆర్‌పై ఉట్నూరు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు: మూసీ ప్రక్షాళణ కుంభకోణం ఆరోపణలపై కీలక తీర్పు
తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన కేసులో బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు హైకోర్టు ఊరట కలిగించే తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది....
