నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి.
ఈ సందర్భంగా మన జీవితంలో వెలుగునింపిన గురువులను స్మరించుకోవడం, వీలైతే వారిని సత్కరించడం మనందరి విధి.
చాలామంది గురువు అంటే కేవలం పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులనే భావిస్తారు. కానీ నిజానికి —
- మీ మొదటి గురువు మాతృమూర్తి. ఆమె ఒడిలోనే మీ మొదటి పాఠాలు ప్రారంభమవుతాయి.
- తదుపరి తండ్రి, జీవిత పథంలో సన్మార్గాన్ని చూపుతూ సూచనలు, సలహాలు ఇస్తారు.
- మీ ఉన్నతికి మార్గదర్శకత్వం వహించిన ప్రతి ఒక్కరూ, మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కరి దగ్గరా, వారు మీ గురువులే.
కేవలం గురుపూజతోనే ఆగిపోకుండా, మీకు సామర్థ్యం ఉంటే, మీ గురువుల ఆర్థిక స్థితిని గమనించి వారికి తగిన సహాయం చేయడం ద్వారా ఆ ఋణం తీర్చుకోవాలి.
🌸 గురుపూజ దినోత్సవ శుభాకాంక్షలు 🌸
— బి. మల్లికార్జున దీక్షిత్
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
📞 91333 20425







